మధ్యప్రదేశ్ విచిత్రాలు... ఓటేసేందుకు గోడను బద్దలు కొట్టారు!
- ఈ ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్
- తలుపు చిన్నగా ఉండి ఓటర్లకు ఇబ్బందులు
- గోడను పగుల గొట్టించిన అధికారులు
ఈ కేంద్రాన్ని చిన్న గదిలో ఏర్పాటు చేయడం, లోపలి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఓటర్లు ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అక్కడి అధికారులు, పోలీసులు గోడను పగులగొట్టించారు. కాగా, ఈ ఉదయం 11 గంటల వరకూ 29 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.