వేధింపులు తాళలేక బస్సులో నుంచి దూకేసిన ఢిల్లీ యువతి!
- నిత్యమూ కాలేజీకి వెళ్లి వచ్చే యువతి
- రెచ్చిపోయే ఆకతాయిలు
- మరిన్ని వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
"నా సోదరి కొన్ని రోజులు వేరే మార్గాల్లో కాలేజీకి వెళ్లింది. రూట్ మారడం వల్ల కాలేజీకి అలస్యంగా చేరుకునేది. దీంతో తిరిగి 544 రూట్ లోనే ప్రయాణం సాగిస్తోంది. చాలా మంది అమ్మాయిలు ఈ మార్గంలో వెళుతుంటారు. దీన్ని అదనుగా చేసుకునే ఆకతాయిలు వేధింపులతో రెచ్చిపోతున్నారు. శనివారం నాడు నా సోదరి బస్సు నుంచి దూకేసి గాయాల పాలైంది. 'నీ గురించి మాకు మొత్తం తెలుసు. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా తెలుసు' అంటుంటే భయపడింది" అని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన ఆ ప్రాంత డీసీపీ విజయ్ కుమార్, ఈ మార్గంలో పోలీసుల నిఘాను పెంచి అమ్మాయిలకు భద్రత కల్పిస్తామని అన్నారు.