కోహ్లీ తీరుపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఫైర్
- కుంబ్లేను కాదని కోహ్లీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు
- కుంబ్లే రాజీనామాకు గల కారణాలు అందరికీ తెలిసినవే
- ఏ ఒక్క ఆటగాడి వల్లో జట్టు బలహీనంగానో, బలంగానో ఉండదు
టీమిండియా బలంగానే ఉందని... ఇదే టీమ్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో పర్యటించిందని బేడీ గుర్తు చేశారు. ఆస్ట్రేలియా టీమ్ లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు లేకపోవడం వల్ల ఆ జట్టు బలహీనంగా ఉందని భావించరాదని... ఏ ఒక్క ఆటగాడి వల్లో జట్టు బలహీనంగానో, బలంగానో ఉండదని తెలిపారు. కోహ్లీ మీద కూడా భరించలేని ఒత్తిడిని పెట్టడం మంచిది కాదని సూచించారు.