ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మర్రి శశిధర్ రెడ్డి
- తప్పుడు సర్వేలు చూపి.. తాను గెలవలేని అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారు
- సనత్ నగర్ ను కావాలనే టీడీపీకి అప్పగించారు
- ఎల్లుండి సాయంత్రంలోగా నా విషయంలో పునరాలోచించుకోవాలి
సనత్ నగర్ టికెట్ తనకు వస్తుందని టీడీపీ ముఖ్యనేతలు కూడా తనతో చెప్పారని అన్నారు. ఎల్బీనగర్ స్థానం కోసం పట్టుబట్టిన తమ పార్టీ నేతలు... సనత్ నగర్ ను కావాలనే టీడీపీకి అప్పగించారని మండిపడ్డారు. ఎల్లుండి సాయంత్రం లోగా తమ పార్టీ తన విషయంలో పునరాలోచించుకోవాలని హెచ్చరించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన తనకు లేదని చెప్పారు.