విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్.. ఓపీటీపై 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన
- అక్టోబర్ 8 నుంచి ప్రజాభిప్రాయాల స్వీకరణ
- ఫీజును విద్యాసంస్థే ముందుగా చెల్లించేలా నిబంధనల రూపకల్పన
- మోసాల నివారణే లక్ష్యమని డీహెచ్‌ఎస్ వెల్లడి
- స్టెమ్ కోర్సుల్లో చదివే విద్యార్థులపై భారీ ప్రభావం పడే ఛాన్స్
అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు భారీ ఫీజు భారం పడే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉన్న ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (ఓపీటీ) కార్యక్రమంలో తొలిసారి పాల్గొనే విద్యార్థులకు 70 వేల డాలర్ల ఫీజు విధించాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) ప్రతిపాదించింది.
తర్వాత మరోసారి ఓపీటీలో పాల్గొనే వారికి 30 వేల డాలర్ల ఫీజు విధించాలని సూచించింది. అయితే ఇవి కేవలం ప్రతిపాదనలు మాత్రమే. ప్రస్తుతం అమల్లోకి రాలేదు. అక్టోబర్ 8 నుంచి నవంబర్ 9 వరకు దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను డీహెచ్‌ఎస్ స్వీకరించనుంది.
ఓపీటీ అంటే ఏంటి?
ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదివే అర్హత కలిగిన విదేశీ విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఉద్యోగం చేసేందుకు ఓపీటీ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లో చదివే విద్యార్థులకు ఇది ఎంతో కీలకం.
ప్రతిపాదిత విధానం ప్రకారం.. విద్యార్థి ఓపీటీకి దరఖాస్తు చేయడానికి ముందే సంబంధిత విద్యాసంస్థ ఈ ఫీజును చెల్లించాలి. విద్యాసంస్థ చెల్లింపు చేయకపోతే ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) అనుమతిని మంజూరు చేయదు.
ఫీజు ఎందుకు?
వలస వ్యవస్థలో మోసాలు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ మార్పులు ప్రతిపాదించినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. కొన్ని విద్యాసంస్థలు, ఏజెన్సీలు, విద్యార్థులు నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం అర్హత ఉన్న విద్యార్థులు ఒక్కో విద్యా స్థాయిలో 12 నెలల వరకు ఓపీటీ పొందొచ్చు. స్టెమ్ కోర్సుల గ్రాడ్యుయేట్లకు మరో 24 నెలల పొడిగింపు కూడా లభిస్తుంది. ప్రజాభిప్రాయాల పరిశీలన తర్వాత ప్రతిపాదనలో మార్పులు చేసి తుది నిబంధనలను ప్రకటించే అవకాశం ఉంది.