కాజోల్ చెల్లిపై కోపంతో.. రాణిముఖర్జీ ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిన నటుడు అర్మాన్ కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాజోల్ చెల్లిపై కోపంతో.. రాణిముఖర్జీ ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిన నటుడు అర్మాన్ కోహ్లీ

  • కాజోల్ సోదరి తనీశాతో డేటింగ్ చేసిన అర్మాన్
  • కాజోల్, రాణీ ముఖర్జీలు కజిన్స్ అవుతారు
  • ఇప్పటికే అర్మాన్ పై ఎన్నో వివాదాలు
బాలీవుడ్ నటి కాజోల్ చెల్లి తనీశా ముఖర్జీపై ఉన్న కోపంతో ఆమె మాజీ ప్రియుడు అర్మాన్ కోహ్లీ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరూ కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్న అర్మాన్... తాజాగా మరో ప్రముఖ నటి రాణీ ముఖర్జీ నివాసం ముందు మూత్రం పోశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మీడియా అర్మాన్ ను ఫొటోలు తీశాయి.

కాజోల్, రాణీ ముఖర్జీ ఇద్దరూ కజిన్స్ అవుతారు. దీంతోనే, ఆమె ఇంటి ముందు అర్మాన్ మూత్రం పోశాడు. అర్మాన్ ప్రవర్తనపై బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. తనీశాకు దూరమైన తర్వాత నీరూ రాంధవా అనే యువతితో అతను డేటింగ్ చేశాడు. ఆమెను దారుణంగా కొట్టి, ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇప్పటికే అతనిపై పలు కేసుల కూడా ఉన్నాయి.
kajol
armaan kohli
tanisha
rani mukherjee
urinate

More Telugu News