అమెరికా మీడియాపై ట్రంప్ చిందులు.. 'నోర్మూసుకుని కూర్చో' అంటూ రిపోర్టర్ కు వార్నింగ్!
- సీఎన్ఎన్ విలేకరిపై తీవ్ర ఆగ్రహం
- ఇబ్బందికర ప్రశ్నలు అడగటంపై మండిపాటు
- వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
‘నువ్వు నీ ప్రవర్తన పట్ల సిగ్గుపడాలి. నువ్వు సీఎన్ఎన్ లో పని చేయకూడదు. నోరు మూసుకుని కూర్చో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జిమ్ అకోస్టా వద్ద ఉన్న మైక్ ను లాక్కునేందుకు ఓ మహిళా ఉద్యోగి యత్నించడంతో కలకలం చెలరేగింది. కాగా ఈ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి జిమ్ కోస్టా ప్రవేశాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఓ మహిళా ఉద్యోగిపై చేయి వేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై జిమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.