మా నాన్న బాధపడటం నేను తట్టుకోలేకపోయాను: నటి జ్యోతి
Add ap7am to your home Screen

మా నాన్న బాధపడటం నేను తట్టుకోలేకపోయాను: నటి జ్యోతి

  • నేను కొన్ని వ్యాంప్ రోల్స్ చేశాను 
  • నా గురించి అలా ప్రచారం జరిగింది 
  • మా నాన్నలో అభద్రతా భావం వచ్చేసింది
నటిగా తనని తాను నిరూపించుకున్న జ్యోతి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నా కెరియర్లో చాలా ఒడిదుడుకులు వున్నాయి. నేను కొన్ని వ్యాంప్ కేరక్టర్స్ చేశాను. దాంతో కొంతమంది జనాలు నిజ జీవితంలోను నేను వ్యాంప్ నే అనుకుని అలా ప్రచారం చేశారు. నేను నెగెటివ్ రోల్స్ చేసినా .. కామెడీ రోల్స్ చేసినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు .. ఇంకా ఎక్కువైపోయింది.

అందువలన నేను మా నాన్నని కూడా పోగొట్టుకున్నాను. ఆ సమయంలో మా నాన్నకి రెండు కిడ్నీలు పాడైపోయి .. బాగా సిక్ అయ్యారు. ఫ్యామిలీకి అండగా నేను వున్నాను అని మా నాన్న అనుకునేవారు. నాపై జరుగుతోన్న ప్రచారం ఆయనను బాగా బాధపెట్టింది. ఆయనలో ఒక రకమైన అభద్రతాభావం కూడా వచ్చేసింది. అది తలచుకుంటేనే నా మనసు బరువెక్కుతుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.   
ali
jyothi

More Telugu News