ఈవీవీ గారు స్థలం అమ్మేశారని తెలిసి .. సినిమా హిట్ కావాలని కోరుకున్నా: హాస్యనటి గీతా సింగ్
- తేజ గారు 'జై'లో ఛాన్స్ ఇచ్చారు
- ఈవీవీ గారు లేని లోటు కనిపిస్తోంది
- దేవుడికి అలా దణ్ణం పెట్టుకున్నాను
ఈవీవీ గారు లేని లోటు చాలా కనిపిస్తోంది. 'కితకితలు' సినిమా చేస్తున్నప్పుడు చాలామంది హీరోయిన్స్ వున్నారు గదా .. 'గీతాసింగ్' ను ఎందుకు పెట్టుకుంటున్నారు?' అని ఆయనను కొంతమంది అడిగారు. అయినా ఆ మాటలను పట్టించుకోకుండా ఆయన నాకే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయనకి ఎంతో ఇష్టమైన ఒక స్థలం అమ్మేశారని తెలిసింది. దాంతో 'ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యేలా చూడు స్వామి' అని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. ఆ సినిమా హిట్ అయినందుకు నేను చాలా సంతోషించాను" అని చెప్పుకొచ్చారు.