తాలిబన్ల పితామహుడు మౌలానా దారుణ హత్య.. ఇంట్లోనే గొంతు కోసి చంపిన దుండగుడు!
- ‘ఫాదర్ ఆఫ్ ది తాలిబన్’గా గుర్తింపు పొందిన మౌలానా
- పాక్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపికైన మౌలానా
- హత్యపై భిన్న కథనాలు
ఇస్లామి జమ్హూరీ ఇత్లెహాద్ తరపున పాకిస్థాన్ పార్లమెంటుకు రెండుసార్లు ఎన్నికైన మౌలానా ‘ఫాదర్ ఆఫ్ ది తాలిబన్’గా గుర్తింపు పొందాడు. మత బోధకుడిగానూ పనిచేశాడు. దాదాపు 40 సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. మౌలానా హత్యపై పాక్ మంత్రి షెరియార్ అఫ్రిది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, మౌలానాను కొందరు దుండగులు కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఓ దుండగుడు అతడిని గొంతు కోసి హత్య చేశాడని ఆయన కుమారుడు తెలిపాడు.