చిరంజీవి అంటే ఇష్టం .. 'ముఠామేస్త్రి' చూసి హీరో కావాలనుకున్నాను: హీరో నవీన్ చంద్ర

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా రాజ్యం చేస్తుంటాయి. అలాంటి ప్రేమకథా చిత్రం ద్వారానే నవీన్ చంద్ర పరిచయమయ్యాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. "చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. అలా ఒకసారి 'ముఠామేస్త్రి' సినిమాకి వెళ్లాను. ఆ సినిమాలో చిరంజీవి సైకిల్ పై ఎంట్రీ ఇస్తారు.

 ఆ సీన్ ఎందుకనో నన్ను బాగా ప్రభావితం చేసింది. నేను కూడా హీరోను కావాలని అనిపించింది. అప్పటి నుంచి ఆ ఆలోచన కొనసాగుతూనే వచ్చింది. హైదరాబాద్ వస్తే స్టూడియోల చుట్టూ తిరిగేవాడిని. మొత్తానికి కొంతకాలం తరువాత నా ప్రయత్నాలు ఫలించి 'అందాల రాక్షసి' సినిమాతో హీరోను అయ్యాను. ఇక ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో నా ఫేవరేట్ కో స్టార్ స్వాతి" అంటూ చెప్పుకొచ్చాడు.  
Go Back to Shorts
naveen chandra

More Telugu News