సీఎం పదవిని వీడనున్న నితీశ్ కుమార్... సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశాహ్వా
- ముఖ్యమంత్రిగా పూర్తి సంతృప్తిని పొందారు
- త్వరలోనే సీఎం పదవి ఖాళీ కానుంది
- తానేమీ నితీశ్ రాజీనామాను కోరడం లేదన్న కుశాహ్వా
ఆయనంతట ఆయనగానే సీఎం పదవిని వీడే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. పట్నాలో జరిగిన ఆర్ఎస్ఎల్పీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఆయన, ఇప్పుడు మరో వ్యాపకం కోసం చూస్తున్నారని అన్నారు. కాగా, కుశాహ్వా చేసిన కామెంట్లపై నితీశ్ కుమార్ గానీ, ఆయన పార్టీ నేతలుగానీ ఇంకా స్పందించలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీ-యూతో పాటు ఆర్ఎస్ఎల్పీ భాగస్వామిగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.