ప్రియురాలి కోసం భార్య పరువు తీసిన ప్రబుద్ధుడు!
- ఆస్ట్రేలియాలో చదివి వ్యాపారం చేస్తున్న వివాహితుడు
- ఓ మీటింగ్ లో పరిచయమైన విడాకులు పొందిన యువతి
- ఆమె కోసం భార్యను వేధించి అరెస్టయిన వ్యక్తి
గత ఏడాది బంజారాహిల్స్ లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్ లో మౌనిక అనే యువతి, తులసీదాస్ కు పరిచయం కాగా, వారి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. అప్పటికే మోనిక తన భర్త ఈశ్వర్ నుంచి విడాకులు తీసుకుని ఉంది. వీరిద్దరి గురించి తెలుసుకున్న తులసీదాస్ భార్య ఈ సంవత్సరం మేలో పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆ సమయంలో తులసీదాస్ అరెస్టై, ఆపై బెయిల్ మీద బయటకు వచ్చాడు.
ఇక, భార్యపై కక్ష పెంచుకున్న అతను, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ, తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తాను మోనికాతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసి పంపడం ప్రారంభించాడు. తన భార్య ప్రవర్తనపై అసభ్య పదజాలంతో వాడుతూ పోస్టులు పెట్టాడు. ఈ వేధింపులు తీవ్రం కావడంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. విచారించిన పోలీసులు, వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.