దీని సోకు పాడుగానూ.. ఖరీదైన చేప ఇస్తే కానీ కదలని కాకి.. వైరల్ అవుతున్న వీడియో

  • చేపల దుకాణంలో వాలిన కాకి
  • ఇష్టమైన చేప కోసం వెతుకులాట
  • సాధారణ చేపలకు నో చెప్పిన కాకి
నీళ్ల కోసం కుండలో గుళకరాళ్లు వేసినప్పుడే కాకి తెలివైనదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పబోయే కాకి కొంచెం రిచ్. ఇది మామూలు చేపలను తినదు. కొంచెం ఖరీదైనా పర్లేదు కానీ రుచిగా ఉండాలి. అందుకనే ఓ చేపల దుకాణంలోకి వచ్చి ఎంచుకుని మరీ తనకు కావాల్సిన చేపను తీసుకుని తుర్రుమంది. కేరళలోని కోచిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఓ చేపల దుకాణం వద్దకు వచ్చి బోలెడన్ని చేపలున్న ట్రేపై వాలిన కాకి.. ఏమాత్రం బెరుకు లేకుండా కావాల్సిన చేప కోసం వెతకసాగింది. సాధారణంగా అయితే, ఏదో ఒక చేపను చటుక్కున ముక్కున కరుచుకుని వెళ్లిపోవాలి. అయితే, ఈ కాకి మాత్రం తనకు ఇష్టమైన చేప కోసం వెతికింది. గమనించిన దుకాణదారు చేపను దాని ముక్కుకు అందిస్తే.. కావు, కావుమని అరుస్తూ వద్దని ట్రేలోనే పడేసింది. దీంతో వింతగా అనిపించిన దుకాణదారు పలు చేపలను దాని ముక్కుకి అందించాడు. అయినప్పటికీ అది తీసుకోలేదు. చివరికి ఓ మంచి, ఖరీదైన చేపల్లో ఒకదానిని దానికి అందించగా, దానిని పట్టుకుని ఎగిరిపోయింది. ఈ మొత్తం ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది.
Go Back to Shorts
Crow
kera
Kochi
Fish
Fish Market

More Telugu News