డీకే అరుణది సిగ్గుతప్పిన బతుకు: జూపల్లి
- అరుణను పానగల్ నుంచి తానే గెలిపించా
- సిగ్గుశరం తెచ్చుకుని నిజాలు మాట్లాడాలి
- క్లర్క్ నుంచి ఈ స్థాయికి ఎదిగిన చరిత్ర నాది
తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని జూపల్లి విమర్శించారు. 2009లో కొల్లాపూర్ సీటు గెలిచి కాంగ్రెస్ పార్టీకి తానే భిక్ష పెట్టానని చెప్పారు. ప్రజల ఆలోచన మేరకే ఆనాడు మంత్రి, ఎమ్మెల్యే పదవులను వదులుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే హక్కు అరుణకు లేదని చెప్పారు. తెలంగాణను తానే ఇచ్చానని 2014లో సోనియాగాంధీ చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేదని... ఇకపై అధికారంలోకి రావడం కూడా కష్టమేనని అన్నారు.