కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల్లోకి నీరు వదిలి ఫొటోలకు కేసీఆర్ పోజులిస్తున్నారు: భట్టివిక్రమార్క
- తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 3 వేల నిరుద్యోగ భృతిని ఇస్తాం
- సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం
కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తిని కలిగించడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లోకి నీరు వదిలి ఫొటోలకు పోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన పార్టీ ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారం కార్యక్రమంలో విజయశాంతి, డీకే అరుణ కూడా పాల్గొన్నారు.