‘ఆగట్టునుంటావా నాగన్న..’ పాటను ప్రస్తావించిన మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్-టీడీపీలు ఒకటయ్యాయి
- ఈ గట్టునుందామా? ఆ గట్టు నుందామా?
- ప్రతి అన్నా, అక్కా తేల్చుకోవాల్సిన ప్రశ్న అదే
కేటీఆర్ మాట్లాడుతూ, ‘ఈ మధ్యన ఓ సినిమా వచ్చింది.. దాని పేరు ఏదో ఉంది కానీ, ఆ సినిమాలో పాట నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో..ఊళ్లో పంచాయతీ ఎలక్షన్స్.. ఓ పాట ఉంటుంది.. ‘నాగన్న ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా..’. ఇవాళ తెలంగాణలో ఉండే ప్రతి అన్నా, అక్కా తేల్చుకోవాల్సిన ప్రశ్న అదే. ఏ గట్టునుందాము? ఈ గట్టునుందామా? ఆ గట్టు నుందామా?’ అని ప్రశ్నించారు.