డీఎస్సీ సహా 18 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్
- ఏపీపీఎస్సీ ద్వారా ఐదారు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
- అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి లోపు నోటిఫికేషన్
- గ్రూప్-1, గ్రూప్-2 మారిన సిలబస్ ను వెబ్ సైట్ లో పెడతాం
అనంతరం, మీడియాతో ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఏపీపీఎస్సీ ద్వారా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాల భర్తీ నిమిత్తం అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి లోపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. నాలుగైదు రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల కోసం మారిన సిలబస్ ను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో వుంచడం జరుగుతుందని తెలిపారు.