ఏపీ వ్యాప్తంగా సోదాలు... టీడీపీకి సన్నిహితంగా ఉన్న బడా వ్యాపారవేత్తలే ఐటీ టార్గెట్!
- తీవ్ర కలకలం రేపుతున్న ఐటీ దాడులు
- పలు చోట్ల ప్రారంభమైన రైడ్స్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్
గత రెండు మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణ రంగ లావాదేవీలు జరిపిన వ్యక్తులు, నాలుగేళ్లకు ముందు నగర శివార్లలో పొలాలను కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న వారే ఈ ఐటీ దాడుల్లో ప్రధాన టార్గెట్ గా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో 50 ఎకరాలకు మించి కొనుగోలు చేసిన వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఇప్పటికే సేకరించిన అధికారులు, ఆయా లావాదేవీల గుట్టు రట్టు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.