'జగన్మోహిని' షూటింగులో బాధతో, భయంతో ఏడ్చేశాను: సీనియర్ నటి ప్రభ
Add ap7am to your home Screen

'జగన్మోహిని' షూటింగులో బాధతో, భయంతో ఏడ్చేశాను: సీనియర్ నటి ప్రభ

  • మేకప్ స్కిన్ కి టైట్ గా పట్టేసింది 
  • బావిలోకి నిజంగానే దింపారు 
  • అందులో 'కప్ప'ను చూసి హడలిపోయాను   
తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. చంద్రమోహన్ .. మురళీమోహన్ వంటి అగ్రకథానాయకుల సరసన ప్రభ అనేక చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ,'జగన్మోహిని' సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు.

"ఈ సినిమా షూటింగు సమయంలో నేను చాలా బాధపడ్డాను .. భయపడ్డాను. ఈ సినిమాలో జయమాలిని నాకు శాపమివ్వడంతో నా స్కిన్ అంతా అదోరకంగా తయారవుతుంది. అందుకోసం ఒక రకమైన మేకప్ వాడారు. ఆ మేకప్ ను రిమూవ్ చేసే లిక్విడ్ ముంబై నుంచి సాయంత్రం ఫ్లైట్ కి వస్తుందని చెప్పారు. నాకు వేసిన మేకప్ స్కిన్ ను టైట్ చేసేస్తూ మంట పుట్టిస్తోంది. అసలే విపరీతమైన ఎండా .. ఉక్కపోత. ఇక ఆ మేకప్ తో వుండగానే నిజంగానే నన్ను బావిలోకి దింపారు. తోడికోడళ్లు పైనుంచి రాళ్లు వేసే సీన్ అది. ఆ బావిలో పెద్ద 'కప్ప' వుంది .. నాకు 'కప్ప' అంటే చచ్చేంత భయం .. అప్పుడు నేను పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ బాధను .. భయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.
prabha
ali

More Telugu News