ఇటలీలో సందడి చేయనున్న పూజా హెగ్డే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటలీలో సందడి చేయనున్న పూజా హెగ్డే

  • 'అరవింద సమేత' పూర్తి చేసిన పూజా హెగ్డే 
  • కొనసాగుతున్న 'మహర్షి' షూటింగ్ 
  • త్వరలో ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు
పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా షూటింగును పూర్తిచేసిన ఆమె, మరో వైపున మహేశ్ జోడీగా 'మహర్షి' సినిమా చేస్తోంది. ఇక ప్రభాస్ తో ఆమె చేయనున్న సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో మొదలు కానుంది. ముందుగా పూజా హెగ్డేకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడం మొదలుపెడతారట. ఆ తరువాత ప్రభాస్ జాయిన్ కానున్నాడని అంటున్నారు. 50 యేళ్ల క్రితం నాటి చరిత్రతో ముడిపడిన ప్రేమకథాంశంతో ఈ సినిమా నిర్మితం కానుంది.         
prabhas
pooja hegde

More Telugu News