నానాటికీ క్షీణిస్తున్న ముషారఫ్ ఆరోగ్యం!
- గుర్తు తెలియని రోగంతో బాధపడుతున్న ముషారఫ్
- లండన్ వెళ్లి వస్తూ చికిత్స పొందుతున్నారు
- వెల్లడించిన ఏపీఎంఎల్ నేత అమ్జాద్
ఆయన వెన్నెముక విరిగిందని, చికిత్స కోసం అమెరికాకు కూడా వెళ్లి వచ్చారని, ఇప్పుడు మరో రుగ్మతతో బాధపడుతూ, లండన్ కు వెళ్లి వస్తున్నారని అమ్జాద్ తెలిపారు. ఆయనకున్న రుగ్మత గురించి దేశానికి ఇప్పుడేమీ చెప్పలేమని, అయితే, కోర్టుకు మాత్రం డాక్యుమెంట్లను సమర్పిస్తామని అన్నారు. ఏదో ఒకరోజు ఆయన పాకిస్థాన్ కు వచ్చి, కోర్టు విచారణకు హాజరవుతారని అన్నారు.