చంద్రబాబు సీఎం అయినా కోర్టుకు రావాల్సిందే!: ధర్మాబాద్ కోర్టు స్పష్టీకరణ
- చట్టానికి ఎవరూ మినహాయింపు కాదు
- సీఎం అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందే
- తదుపరి విచారణకు అందరూ కోర్టుకు హాజరుకావాలి
ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఎవరికీ కోర్టు నుంచి మినహాయింపులు ఉండవని చెప్పారు. తదుపరి విచారణకు కేసులో ఉన్న వారందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించారు.