గతంలో మనోహరాచారి ఫ్యాక్షనిస్టుల అనుచరుడు... ఆర్థికంగా చితికిన తరువాతే హైదరాబాద్ కు వలస!
- ఫ్యాక్షన్ నేతల అనుచరుడిగా మనోహరాచారి
- ఆర్థికంగా దెబ్బతిని, హైదరాబాద్ కు వలస
- చిన్న ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పైకి తెచ్చిన వైనం
మాధవి పుట్టిన తరువాత బతుకుదెరువుకు చాలినంత డబ్బు సంపాదన లేదని భావించిన ఆయన, భార్యా బిడ్డలను తీసుకుని రాజధానికి వలస వచ్చాడు. ఆపై అమీర్ పేటలోని ఓ ఆభరణాల దుకాణంలో మెరుగుపెట్టే పనికి చేరాడు. ఆయన భార్య కూడా చిన్న ఉద్యోగం చేస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరగా, ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పైకి తెచ్చిన సమయంలో, కుమార్తె ప్రేమ వివాహం ఆయనను రాక్షసుడిగా మార్చింది.