ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. జూలై నెలలో దాదాపు 1.18 కోట్ల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. టెలికం దిగ్గజ సంస్థలైన ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌లు మొత్తంగా 9.27 లక్షల మందిని మాత్రమే కొత్త వినియోగదారులను చేర్చుకోగా, జియో దీనికి 13 రెట్లు అధికంగా చేర్చుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఈ వివరాలను విడుదల చేసింది. కొత్తగా చేరిన ఖాతాదారులతో కలుపుకుని జియో మొబైల్ సబ్‌స్క్రైబర్ల బేస్ 19.6 శాతానికి చేరుకుంది. అలాగే, జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 22.7 కోట్లకు చేరుకుంది.