తెలంగాణను చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో అందరికీ తెలుసు: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణను చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో అందరికీ తెలుసు: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

  • తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయి 
  • రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మిణుకుమిణుకు మంటోంది
  • కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే
తెలంగాణ రాకుండా అడ్డుపడిన పాపానికి తెలుగుదేశం పార్టీకి  రాష్ట్రంలో నూకలు చెల్లాయని, అందుకే ఆ పార్టీ కాంగ్రెస్‌ గొడుగు కిందకు చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్‌ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు చంద్రబాబు ఎలా అడ్డుపడ్డారో అందరికీ తెలుసన్నారు.

అందుకే ఆ పార్టీ పరిస్థితి మిణుకుమిణుకు మంటోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌ లకు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్టేనన్నారు. శుక్రవారం నుంచి ఎన్నికల క్షేత్రంలోకి దిగనున్నామని, 15న పాలమూరులో జరిగే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హాజరు కానున్నారని తెలిపారు. 
Lakshman
BJP
Chandrababu
Telugudesam

More Telugu News