కింగ్‌కోఠిలో సిగ్నల్ దగ్గర ఆగిన కేటీఆర్.. మంత్రితో సెల్ఫీలు దిగిన యువత!
- కింగ్ కోఠి వద్ద ఆగిన మంత్రి కాన్వాయ్
- హాయ్ చెప్పి సెల్ఫీ దిగిన బెంగళూరు అమ్మాయి
- ఆ తర్వాత క్యూకట్టిన యువత
ఆ వెంటనే మాటలు కలిపిన యువతి తనకు సెల్ఫీ కావాలని రిక్వెస్ట్ చేసింది. దీనికి సరేనన్న కేటీఆర్ కారులోంచి కిందికి దిగి ఆమెతో సెల్ఫీ దిగారు. ఆమె ఖుషీ అయిపోగా, ఇది చూసిన మరికొందరు మంత్రితో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. మంత్రి సహనంగా అందరితోనూ సెల్ఫీలు దిగడంతో యువత సంతోషం వ్యక్తం చేసింది. మంత్రితో తాము దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఎక్కడ చూసినా అవే కనిపించాయి.
