వర్ధంతి సందర్భంగా వైయస్సార్ ను స్మరించుకున్న చంద్రబాబు!
- నేడు వైయస్ వర్ధంతి
- తన మిత్రుడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు
- పార్టీలు వేరైనా.. ఇద్దరి మధ్య చెరగని స్నేహం
చంద్రబాబు, వైయస్ ల మధ్య మంచి స్నేహబంధం ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకే సమయంలో ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చి, తమదైన ముద్ర వేశారు. తదనంతర కాలంలో చంద్రబాబు టీడీపీలోకి వచ్చినా... ఇద్దరి మధ్య స్నేహం తెగిపోలేదు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఇద్దరు నేతల మధ్య ఎంతో ఆసక్తికరంగా చర్చ కొనసాగేది. ఈ నేపథ్యంలోనే వర్ధంతి సందర్భంగా తన మిత్రుడిని చంద్రబాబు మరోసారి గుర్తు చేసుకున్నారు.