విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేను అలా అనలేదు: నాగశౌర్య

విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేను అలా అనలేదు: నాగశౌర్య

  • నాగశౌర్య హీరోగా '@ నర్తనశాల'
  • ప్రమోషన్స్ లో నాగశౌర్య బిజీ 
  • రేపే భారీస్థాయి విడుదల  
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన '@ నర్తనశాల' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఇకపై కొత్తగా స్టార్లు రారు .. చరణ్ తోనే స్టార్ స్టేటస్ అనేది ఆగిపోయింది" అని అన్నాడు. దాంతో ఆయన విజయ్ దేవరకొండ స్టార్ కాదనే విషయాన్ని పరోక్షంగా చెప్పాడని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం పట్ల మరో ఇంటర్వ్యూలో నాగశౌర్య స్పందించాడు. "స్టార్ స్టేటస్ అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు .. ఆ స్థాయిని అందుకోవడానికి చిరంజీవికి చాలాకాలం పట్టింది. పవన్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల వరకూ వసూలు చేస్తోంది .. క్రేజ్ అంటే అది" అనే అభిప్రాయం నాది. ఈ విషయంలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేను కామెంట్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక్క విజయ్ దేవరకొండను మాత్రమే కాదు .. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదు" అని క్లారిటీ ఇచ్చాడు. 
nagashaurya

More Telugu News