పూజలు చేయడానికి వచ్చి ఇల్లాలిపై కన్నేసిన మాంత్రికుడు.. భర్తకు మత్తుమందిచ్చి భార్యతో పరారీ!
- కర్నూలు జిల్లా డోన్‌లో ఘటన
- అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ
- దయ్యాలను తరిమేస్తానని వచ్చిన మాంత్రికుడు
మాంత్రికుడి మాటలు నిజమేనని నమ్మిన శ్రీనివాసులు సరేనన్నాడు. చెప్పినట్టే ఇంట్లో క్షుద్రపూజలు చేసిన మాంత్రికుడు రంగస్వామి.. లక్ష్మిపై కన్నేశాడు. శ్రీనివాసులకు మత్తుమందు ఇచ్చాడు. అతడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక లక్ష్మి, ఆమె కుమార్తెను తీసుకుని పరారయ్యాడు. కాసేపటికి మెలకువ వచ్చి చూసిన శ్రీనివాసులు ఇంట్లో భార్య, కుమార్తె కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.