రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఫొటో దిగేందుకు ఉద్యోగి కోటు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్!
- జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఇమ్రాన్
- ఉద్యోగి కోటు ధరించి ఫొటో
- ఈ నెల 18న ప్రధానిగా ప్రమాణ స్వీకారం
జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీకి ఇమ్రాన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫొటో దిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ ఈనెల 18న పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.