జయశంకర్ సార్ జీవితం మనందరికీ స్ఫూర్తి దాయకం: ఎంపీ కవిత
- ఉద్యమ సమయంలో పలు పరిస్థితులు ఎదుర్కొన్నాం
- నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు
- అందుకు జయశంకర్ సార్ జీవితమే నిదర్శనం
అనంతరం జరిగిన సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాల పరిస్థితులను తాము ఎదుర్కొన్నామని, వాటిని అధిగమించేందుకు జయశంకర్ సార్ వద్ద కూర్చొని చర్చించిన సంగతులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తున్న సమయంలో ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు జయశంకర్ సార్ జీవితమే మనకు నిదర్శనమని కొనియాడారు.