వింబుల్డన్ లో ఫార్వార్డ్ డిఫెన్స్... క్రికెట్ షాట్ చూపిన ఫెదరర్ వీడియో!
- సోమవారం నాడు ప్రీక్వార్టర్ ఫైనల్స్ ఆడిన ఫెదరర్
- వెరైటీగా క్రికెట్ షాట్ కొట్టిన స్విస్ స్టార్
- అభిమానులతో షేర్ చేసుకున్న వింబుల్డన్ నిర్వాహకులు
ఈ మ్యాచ్ లో క్రికెట్ లో కనిపించే ఫార్వార్డ్ డిఫెన్స్ షాట్ ను తన రాకెట్ తో ఆడి చూపించాడు ఫెదరర్. ఆ వీడియోను వింబుల్డన్ నిర్వాహకులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఈ క్రికెట్ షాట్ కు ఫెదరర్ కు ఎంత రేటింగ్ ఇస్తారని ఐసీసీని వింబుల్డన్ ప్రశ్నించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.