లోకేష్ అసెంబ్లీకి పోటీ చేయడంపై చినరాజప్ప కీలక వ్యాఖ్యలు
- తనకు నచ్చిన చోటి నుంచి పోటీ చేస్తారు
- పవన్ మాదిరిగా పార్ట్ టైమ్ నాయకులం కాదు
- బీజేపీతో పవన్, జగన్ కుమ్మక్కయ్యారన్న చినరాజప్ప
తామేమీ పవన్ కల్యాణ్ మాదిరిగా పార్ట్ టైమ్ రాజకీయ నాయకులం కాదని చెప్పిన చినరాజప్ప, లోకేష్ ఎన్నికల్లో గెలిచి చూపిస్తారని అన్నారు. భారతీయ జనతా పార్టీతో పవన్, జగన్ లు కుమ్మక్కయ్యారని, వారి కుట్ర రాజకీయాలను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా బరిలోకి దిగనుందని చినరాజప్ప చెప్పారు.