దిగొచ్చిన ట్రంప్... కఠినాతి కఠిన ఉత్తర్వులు వెనక్కు!
- ఇకపై తల్లిదండ్రుల వద్దనే బిడ్డలు
- కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
- వలసదారుల కుటుంబాలను కలిపే ప్రాసిక్యూట్ చేస్తామన్న ట్రంప్
అమెరికా సరిహద్దులు ప్రస్తుతం చాలా గట్టిగా ఉన్నాయని, కుటుంబాలను కలిపి ఉంచే విచారణ చేపట్టాలని నిర్ణయించామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులకు దూరమైన పిల్లల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు అమ్మానాన్నల కోసం ఏడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కావడంతో ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.