ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెరుగుతున్న గుండె ముప్పు!
- ఏపీలో అత్యధికంగా 19 శాతం మందికి..
- తెలంగాణలో 16 శాతం మందికి గుండె ముప్పు
- ఆందోళనకు గురిచేస్తున్న అధ్యయనం
కార్డియో వాస్క్యులర్ డిసీజ్‌గా పేర్కొనే ఈ జబ్బులు రాష్ర్టాల వారీగా వివిధ స్థాయులలో పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో 15-16 శాతం మంది ప్రజలు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో అత్యధికంగా 18-19 మంది గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. జార్ఖండ్, కేరళలలో మాత్రం అది 13.2-19.5 మధ్య నమోదైంది.