అమ్మ ప్రేమను తెలిపే ఫొటో షేర్‌ చేసిన రేణూ దేశాయ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మ ప్రేమను తెలిపే ఫొటో షేర్‌ చేసిన రేణూ దేశాయ్‌

  • చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫొటో
  • రేణూ దేశాయ్‌ని కూడా ఆకట్టుకున్న వైనం
  • కూతురిని స్కూల్‌కి పంపడానికి రెడీ చేస్తోన్న తల్లి
చాలా కాలంగా ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ స్ఫూర్తినిస్తోంది. ‘నా జీవితం బాగోలేదనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ ఫొటోను చూస్తుంటాను’ అని రాసి ఉన్న ఆ ఫొటో అందరికీ నచ్చేస్తోంది. తాజాగా సినీనటి, ప్రొడ్యూసర్‌ రేణూ దేశాయ్‌ కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలో దీనిని పోస్ట్ చేశారు. అది రేణూ దేశాయ్‌కి కూడా బాగా నచ్చేసినట్లుంది. తన పిల్లల ఫొటోలను అధికంగా పోస్ట్ చేసే ఆమె.. తల్లి ప్రేమకు అద్దం పడుతోన్న ఆ ఫొటోను పోస్ట్ చేసి తనకు స్ఫూర్తినిస్తోందని తెలిపింది.

కాగా ఆ ఫొటోలో ఓ మహిళ తన కూతురిని స్కూల్‌కి పంపడానికి రెడీ చేస్తూ ఉంటుంది. పేదరికం కారణంగా సిమెంట్ డ్రైనేజ్ పైపులనే నివాసంగా మార్చుకుని జీవిస్తున్నప్పటికీ, తన పిల్లల ఎదుగుదలను తల్లి మర్చిపోలేదని ఆ ఫొటోలోని మహిళ నిరూపిస్తోంది.      
renu desai
mother

More Telugu News