విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్సింగ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్సింగ్‌!

  • కుటుంబ సభ్యులతో కారులో కోహ్లీ సెల్ఫీ
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విరాట్‌
  • అనుష్క కూడా ఉంటే బాగుండేదంటోన్న నెటిజన్లు
ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సారథ్యం వహించిన విరాట్‌ కోహ్లీ తాజాగా తమ కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్‌ చేస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో ఆయన భార్య, సినీనటి అనుష్క శర్మ లేదు. అందులో కోహ్లీ తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు.

దీంతో నెటిజన్లు అనుష్క ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె కూడా ఉంటే బాగుండేదని కొందరు కామెంట్లు చేస్తుండగా, ఆమె లేకుండానే కారులో ఎందుకు వెళుతున్నావంటూ మరికొందరు అడుగుతున్నారు. నెక్స్ట్‌ టైమ్‌ అనుష్క శర్మ లేకుండా సెల్ఫీ దిగకని మరొకరు కామెంట్‌ చేశారు.                                 
Virat Kohli
Anushka Sharma
Cricket

More Telugu News