కొరటాల మూవీలో చిరూ ద్విపాత్రాభినయం?
- 'సైరా'తో బిజీగా చిరంజీవి
- నెక్స్ట్ మూవీ కొరటాలతో
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను .. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు పాత్రలను కూడా కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై వున్నాడని అంటున్నారు. కొరటాల వరుసగా ఘన విజయాలను అందుకుంటూ వస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందో చూడాలి.