అప్పులపాలవడంతో అప్పట్లో ఇండస్ట్రీ వదిలిపెట్టేసి వెళ్లిపోయా!: నటుడు జయప్రకాశ్ రెడ్డి
- చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు
- అప్పులు చేయవలసి వచ్చింది
- భార్యాబిడ్డలతో సొంతవూరు వెళ్లిపోయా
ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసి వచ్చాను కనుక .. అప్పులు చేస్తూ 9 సంవత్సరాల పాటు నా భార్యా బిడ్డలను చూసుకున్నాను. అమ్మో.. ఇక ఇక్కడే వుంటే ఇంకా ఇబ్బంది పడిపోతానని చెప్పేసి ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయాను. అట్లా వెళ్లిపోయిన నేను అయిదు సంవత్సరాల పాటు స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ మా ఊళ్లోనే వున్నాను. ఈ అయిదు సంవత్సరాల్లో నన్ను గుర్తుపెట్టుకుని ఫోన్ చేసింది ఒక్క సురేశ్ ప్రొడక్షన్స్ వారే .. కానీ నేను వెళ్లలేదు .. సినిమాలు కలిసి రావడం లేదనేదే అందుకు కారణం" అని చెప్పుకొచ్చారు.