మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను: తన పిల్లలను ఉద్దేశించి రేణు దేశాయ్‌ ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను: తన పిల్లలను ఉద్దేశించి రేణు దేశాయ్‌ ట్వీట్

  • అకీరా, ఆద్యల ఫొటోలను పోస్ట్ చేసిన రేణు దేశాయ్
  • ఒక హృదయం, ఒక ఆత్మ అంటూ కవిత
  • ఓ తల్లి రాసిన అతి చిన్న కవిత అని పేర్కొన్న రేణు
సినీ నటి రేణు దేశాయ్ ఒక్కోసారి భావోద్వేగపూరితంగా కవితలు రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ వారి గురించి కూడా చెబుతుంటారు. తాజాగా ఆమె మరోసారి తన పిల్లల ఫొటోను పోస్ట్ చేసి ఓ కవిత రాశారు.
 
'ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను... మీ కోసం నేను ప్రాణాలు తీస్తాను.. తన పిల్లల కోసం ఓ తల్లి రాసిన అతి చిన్న కవిత.. నేను ఈ ఇద్దరి ఫొటోలను తీస్తూనే ఉంటాను' అని రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలను ఉద్దేశించి పేర్కొన్నారు.
Twitter
renu desai

More Telugu News