బాలీవుడ్‌ శృంగార తార సన్నీలియోన్‌ తీవ్ర భావోద్వేగపూరితంగా చేసిన ఓ ట్వీట్‌ ఆమె అభిమానులను కదిలించింది. ఆమె ప్రస్తుతం దక్షిణాది సినిమా ‘వీరమహాదేవి’లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా, తన జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ‘కరణ్‌ జిత్‌ కౌర్- ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్’ని ఆమె చూడడం జరిగింది.

ఈ సందర్భంగా సన్నీలియోన్‌ ట్వీట్‌ చేస్తూ... ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదని, తన హృదయం కొన్ని వేలసార్లు బద్దలైందని పేర్కొంది. తాను నీలి చిత్రాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో, మళ్లీ అలా కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదని, తన పాత వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుందని, తాను తప్పు చేశానని పేర్కొంది. ఆమె చేసిన ఈ ట్వీట్ అభిమానుల హృదయాలను తాకింది.