పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- పురుషుడిగా మారేందుకు అనుమతి నిరాకరించిన డీజీపీ
- హైకోర్టును ఆశ్రయించిన మహిళా కానిస్టేబుల్
- హైకోర్టు సూచనతో అనుమతించిన ప్రభుత్వం
- ఆసుపత్రిలో చేరిన లలిత
హైకోర్టు సూచన మేరకు ముఖ్యమంత్రి ఫడ్నవిస్, హోంమంత్రి డాక్టర్ రంజిత్ పాటిల్‌లు లలితకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలతో పోలీసు అధికారులు శస్త్రచికిత్స కోసం లలితకు నెల రోజుల సెలవు మంజూరు చేశారు. ఈ మేరకు ఎస్పీ జి.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో లలిత జేజే ఆసుపత్రిలో చేరింది.