అధికారంలోకి వచ్చాక సోంపేట బీల సమస్యను పరిష్కరిస్తా: పవన్ కల్యాణ్‌ హామీ
Add ap7am to your home Screen

అధికారంలోకి వచ్చాక సోంపేట బీల సమస్యను పరిష్కరిస్తా: పవన్ కల్యాణ్‌ హామీ

  • శ్రీకాకుళం సోంపేట బీలల్లో పవన్ కల్యాణ్‌ పర్యటన
  • రైతులు, యువత సమస్యలపై జనసేన కార్యకర్తలు పోరాడాలి
  • పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధికి మేం వ్యతిరేకం
జన పోరాట యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోంపేట, పలాస ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ హామీలు ఇస్తున్నారు. పర్యటనలో భాగంగా సోంపేట బీల భూముల్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక సోంపేట బీల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రైతులు, యువత సమస్యలపై జనసేన కార్యకర్తలు పోరాడాలని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ చేసే అభివృద్ధికి జనసేన వ్యతిరేకమని అన్నారు. కాగా, సోంపేటలో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోన్న విషయం తెలిసిందే.               
Pawan Kalyan
Jana Sena

More Telugu News