కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ముందున్న అవకాశాలు ఏమిటంటే..!
- సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష
- బలపరీక్షలో నెగ్గుతామన్న యడ్యూరప్ప
- యడ్డీ ఓటమి ఖాయమన్న జేడీఎస్, కాంగ్రెస్
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ముందున్న అవకాశాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణల ప్రకారం బీజేపీ ముందున్న అవకాశాలు ఇవే...
- మ్యాజిక్ ఫిగర్ ను సాధించేందుకు అవసరమైనంతమంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడం.
- విపక్షాలకు చెందిన 14 నుంచి 16 మంది ఎమ్మెల్యేలు సభకు హజరుకాకపోవడం.
- బీజేపీ ఓటమి తప్పదు అని స్పష్టమైన తరుణంలో... సభలో గందరగోళం సృష్టించి, సభను వాయిదా వేయించడం.
- గెలవలేమని తేలిన పక్షంలో యడ్యూరప్ప రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లడం.