త్రివిక్రమ్ .. సీతారామశాస్త్రితో మ్యూజిక్ సిటింగ్స్ .. తమన్ హ్యాపీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ .. సీతారామశాస్త్రితో మ్యూజిక్ సిటింగ్స్ .. తమన్ హ్యాపీ!

  •  ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ 
  • షూటింగు దశలో సినిమా
  • కొనసాగుతోన్న మ్యూజిక్ సిటింగ్స్
తెలుగు సినీ సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ తరువాత వినిపించే పేరు తమన్. కెరియర్ ను ఆరంభించిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు యూత్ ను మెప్పించే ట్యూన్స్ ను అందిస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇటీవల కాలంలో ఆయన చేసిన ట్యూన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయన చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. తాజాగా ఆయన త్రివిక్రమ్ సినిమాకి పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఒక వైపున ఈ సినిమా షూటింగు కొనసాగుతూ ఉండగానే, మరో వైపున ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. తమన్ బాణీలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలను రాసే పనిలో వున్నారు. "స్క్రిప్ట్ ను అద్భుతంగా సిద్ధం చేయగల త్రివిక్రమ్ తోను .. పాటలను గొప్పగా రాయగల సిరివెన్నెల గారితోను ఈ రోజు పని చేశాను .. " అంటూ ఆ ఇద్దరితో కలిసి దిగిన ఫొటోను తమన్ పోస్ట్ చేశాడు.
taman
trivikram
sirivennela

More Telugu News