ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వకపోతే న్యాయ పోరాటమే!: కర్ణాటక కాంగ్రెస్
- సర్కార్ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ పోటాపోటీ!
- మాకు అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తాం: కాంగ్రెస్
- జేడీఎస్ లో చీలిక లేదంటున్న కుమారస్వామిగౌడ
ఈ సందర్భంగా జేడీఎస్ లో చీలిక లేదని ఆ పార్టీ నేత కుమారస్వామి గౌడ చెబుతున్నారు. కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేవలం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగడితే సరిపోదు. అందుకే, జేడీఎస్ లో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్ జాగ్రత్తపడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలిస్తున్నట్టు సమాచారం.