డోంట్ వర్రీ.. నా వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు!: బీజేపీకి దేవెగౌడ పెద్ద కొడుకు అభయాస్తం?
- క్షణ క్షణానికి మారుతున్న కర్ణాటక రాజకీయాలు
- కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిగ్నల్
- బీజేపీకి మద్దతు ఇస్తానని దేవెగౌడ పెద్ద కుమారుడు చెప్పినట్టు సమాచారం
బీజేపీకి దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. తన వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమంటూ, తాజాగా హోలెనరసిపూర్ స్థానం నుంచి గెలుపొందిన రేవన్న ఇప్పటికే బీజేపీకి భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఇదే నిజమైతే... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే చెప్పొచ్చు.