కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత!
- కర్ణాటకలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
- మ్యాజిక్ ఫిగర్ కంటే వెనుకబడ్డ బీజేపీ
- జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు
ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.