మూడు డిస్ ప్లేలతో కూడిన ట్యాబ్లెట్... పేటెంట్ కోసం మైక్రోసాఫ్ట్ దరఖాస్తు
- రెండు ప్రధాన డిస్ ప్లేలు, ఒక చిన్న డిస్ ప్లే
- లోపలకు, బయటకు మడవడానికి వీలు
- ఇటీవలే మోటరోలా సైతం ఫోల్డబుల్ డివైజ్ పేటెంట్ కోసం దరఖాస్తు
పరికరాన్ని ఓపెన్ చేసినప్పుడు రెండు ప్రధాన డిస్ ప్లేలు కనిపిస్తాయి. మరోచిన్న డిస్ ప్లే వీటికి ఆనుకుని ఉంటుంది. ఇది ఇంకా పేటెంట్ దశలోనే ఉందని, నిజంగా మార్కెట్లోకి వస్తుందా అని ఇప్పుడే చెప్పడం కష్టమంటున్నారు విశ్లేషకులు. చైనాకు చెందిన జెడ్ టీఈ ఇప్పటికే మడవడానికి వీలుండే ఆక్సన్ ఎం స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తోంది.